![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం బిబి 9 స్పెషల్ థీమ్ తో రాబోతోంది. ఐతే ఇందులో బిగ్ బాస్ 9 లో ఉన్న హౌస్ మేట్స్ తో ఒక ఫ్యామిలీ ట్రీని రెడీ చేశారు. ఒక బోర్డు మీద హౌస్ మేట్స్ ఇమేజెస్ ని పేస్ట్ చేసారు.
ఇక ఈ ఫ్యామిలీ ట్రీలో ఎవరు ఏంటో ఇమ్మానుయేల్ కామెడీగా చెప్పుకొచ్చాడు. భరణి గారు నాన్న, సంజన అమ్మ. భరణి గారికి సంజన గారికి సంబంధం లేదు వేరే అని చెప్పుకొచ్చాడు ఇమ్మానుయేల్. తనూజ కూతురు, ఇమ్మానుయేల్ కొడుకు అని రాసాడు. వెంటనే హరి- అవినాష్ కలిసి తనూజ, ఇమ్మానుయేల్ అక్క తమ్ముళ్లు అవతారన్నమాటా అన్నారు. ఈ వృక్షంలో బావ డీమన్ పవన్, మరదలు రీతూ చౌదరి అని రాసాడు. "డీమన్ పవన్ నువ్వే బావంటరోయ్" అని శ్రీముఖి అనేసరికి రీతూ తెగ సిగ్గు పడిపోయింది. "బావా నాకు కావాలి పాలకోవా" అంటూ అడిగేసింది రీతూ. "అంటావ్ గా అనురా నేనున్నాగా నన్ను తిను అని" ఇమ్మానుయేల్ డీమన్ కి హింట్ ఇచ్చాడు.
ఇక ఫామిలీ ట్రీలో రాము రాథోడ్ అంటే ఇంట్లోంచి పారిపోయిన తమ్ముడు, కళ్యాణ్ పడాలా పక్కింటి కుర్రోడు అనేసరికి "మీ ఇంట్లో కూర్చుని లైన్ వేస్తాడా" అని హరి అడిగాడు. "ఈయనకు భరణి గారి ఇంటి మీదనే కన్ను" అంటూ ఇమ్మానుయేల్ చెప్పాడు.
తరువాత ప్రియాశెట్టి బాబాయ్ అంటుంది కాబట్టి రెండో కూతురు అని రాసాడు. "రెండో కూతురు అంటే టాప్ 5 వరకు రావాలి కదా" అని శ్రీముఖి అడిగింది. "ఫస్ట్ కూతురు తనూజ కోసం రెండో కూతురు వచ్చేసింది" అని చెప్పాడు ఇమ్మానుయేల్. ఇక ఈ ఫ్యామిలీ ట్రీలో ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఎవరో ఏంటో తెలియాలంటే ఆదివారం ప్రసారం అయ్యే ఈ షో చూడాల్సిందే.
![]() |
![]() |